ASF: తిర్యాణి మండలం గుడ్లపల్లి ఉప సర్పంచ్‌గా సోయం కట్టి మళ్లీ ఎన్నికయ్యారు. వార్డు సభ్యుల సమావేశంలో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. గతంలో ఉప సర్పంచ్‌గా సేవలు అందించిన కట్టిపై నమ్మకంతో వార్డు సభ్యులు మరోసారి బాధ్యతలు అప్పగించారు. ఆయన మాట్లాడుతూ.. తనపై నమ్మకముంచి రెండోసారి అవకాశం కల్పించిన సర్పంచ్, వార్డు సభ్యులు, గ్రామ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు.