నిరసనల పేరిట బంగ్లాదేశ్ పౌరులు అరాచకం సృష్టిస్తున్నారు. ఇప్పటికే ఓ హిందువును ఉరి తీసి, మృతదేహానికి కాల్చిన దుండుగులు.. తాజాగా ఓ వ్యాపారవేత్త ఇంటికి నిప్పు పెట్టారు. తెల్లవారుజామున ఆ వ్యాపారవేత్త ఇంటికి ఉన్న రెండు తలుపులకు తాళం వేసి, పెట్రోల్ పోసి అంటించారు. దీంతో లోపల ఉన్న వారు బయటకు రాలేకపోవడంతో ఆయన కుమార్తె సజీవ దహనం కాగా.. మరో ఇద్దరు పిల్లలు తీవ్రంగా కాలిపోయారు.