MBNR: జిల్లాలోని సన్న వరి సాగుదారులకు ప్రభుత్వం ఆర్థిక ఊరట కల్పించింది. సన్న రకం బోనస్ కింద రూ.21.95 కోట్లను రైతుల ఖాతాల్లో జమ చేసేందుకు పౌరసరఫరాల శాఖ ఏర్పాట్లు పూర్తి చేసింది. జిల్లాలో 7,971 మంది రైతులు అర్హత సాధించగా, ముందుగా 4,000 మంది రైతుల ఖాతాల్లోకి డబ్బులు జమ చేస్తామని డీఎం రవి నాయక్ తెలిపారు. అనంతరం మిగిలిన రైతులకు అందజేస్తామని పేర్కొన్నారు.