బాలీవుడ్ నటి నోరా ఫతేహి కారు ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. తాజాగా తాను క్షేమంగా ఉన్నానని నోరా తెలిపింది. డ్రింక్ చేసిన ఓ కారు డ్రైవర్ తన వాహనాన్ని ఢీ కొట్టాడని, దీంతో తన తల కారు విండోకు తగిలిందని పేర్కొంది. ప్రస్తుతానికి బాగానే ఉన్నానని, తల తిరగడం, వాపు వంటి సమస్యలు ఉన్నాయని, ఇంకా గాయాలు మానలేదని తెలిపింది. డ్రంక్ అండ్ డ్రైవ్‌ను ప్రోత్సహించొద్దని విజ్ఞప్తి చేసింది.