TG: ధ్యానం ద్వారా ప్రశాంతంగా ఉంటుందని శ్రీరామచంద్ర మిషన్ అధ్యక్షుడు కమలేశ్ డి పటేల్(దాజీ) అన్నారు. ధ్యానం ద్వారా ఒత్తిడి, ఆందోళనను జయించవచ్చునని, మనసు కేంద్రంగా ధ్యానం చేస్తే సత్ఫలితాలు ఉంటాయన్నారు. మనసు ప్రశాంతంగా ఉంటే ఏకాగ్రత వస్తోందని, ఏకాగ్రత ద్వారా సునాయాసంగా విజయాలు సాధించవచ్చన్నారు. ధ్యానం చేశాక వచ్చే మార్పును మీరు గమనించవచ్చని సూచించారు.