ప్రకాశం: కనిగిరిలో పల్స్ పోలియో కార్యక్రమాన్ని ఇవాళ మున్సిపల్ ఛైర్మన్ అబ్దుల్ కఫార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆరోగ్య సిబ్బంది ఏర్పాటు చేసిన పల్స్ పోలియో కార్యక్రమంలో చిన్నారులకు పల్స్ పోలియో చుక్కలు వేశారు. ఆయన మాట్లాడుతూ.. పట్టణంలో ఉన్న చిన్నారులందరికీ తప్పనిసరిగా తల్లిదండ్రులు పోలియో చుక్కలు వేయించాలన్నారు. ఈ కార్యక్రమంలో హెల్త్ సిబ్బంది పాల్గొన్నారు.