TG: పినపాక కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే వెంకటేశ్వర్లు ఘాటు వ్యాఖ్యలు చేశారు. పంచాయతీ ఎన్నికల్లో కొందరు పార్టీకి ద్రోహం చేశారని మండిపడ్డారు. పార్టీలో ఉంటూ కాంగ్రెస్ను ఓడించేందుకు పనిచేశారని ఆరోపణలు చేశారు. పార్టీకి ద్రోహం చేసిన వారి చిట్టా తన దగ్గర ఉందని వెల్లడించారు. పార్టీపరంగా వారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు.