BHPL: జిల్లా మోరంచపల్లి గ్రామంలో రేపు రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఆధ్వర్యంలో వరదలు, పారిశ్రామిక ప్రమాదాల పై మాక్ డ్రిల్ నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ రాహుల్ శర్మ తెలిపారు. ఇవాళ కలెక్టర్ మాట్లాడుతూ.. మాక్ డ్రిల్‌లో వరదల సమయంలో ముందస్తు జాగ్రత్తలు, గాయపడినవారికి తక్షణ వైద్య సహాయం అందించే విధానాలపై ప్రాయోగాత్మక అవగాహన కల్పిస్తామన్నారు.