ATP: ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ జన్మదినం సందర్భంగా పార్టీ శ్రేణులు వినూత్నంగా సేవా కార్యక్రమాలు నిర్వహించారు. గజమాలలు, బొకేలకు బదులుగా నాయకులు అందజేసిన విద్యా సామగ్రిని రాప్తాడు ఏపీ మోడల్ స్కూల్ విద్యార్థులకు ఎంపీ స్వయంగా పంపిణీ చేశారు. ఇందులో 550 పుస్తకాలు, 80 జియోమెట్రీ బాక్సులు, 150 పెన్సిల్ కిట్లు ఉన్నట్లు ఆయన తెలిపారు.