AP: YCP నేతలపై DY.CM పవన్ వ్యాఖ్యలకు మాజీమంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ కౌంటర్ ఇచ్చారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై ప్రశ్నిస్తే రౌడీయిజమా అంటూ నిలదీశారు. పవన్ బెదిరింపులకు భయపడేది లేదని, ప్రభుత్వ తప్పులను ప్రశ్నిస్తూనే ఉంటామని స్పష్టంచేశారు. కూటమి నేతల అరాచకాలను పవన్ ప్రశ్నించట్లేదని.. జనసేన పార్టీ TDPకి అనుబంధ సంస్థగా మారిందని వెల్లంపల్లి దుయ్యబట్టారు.