SDPT: పురుగు మందు తాగి దంపతులు ఆత్మహత్య చేసుకున్న ఘటన బెజ్జంకిలో జరిగింది. స్థానికుల వివరాలు.. మండలంలోని దాచారానికి చెందిన వడ్లకొండ శ్రీహర్ష, రుక్మిణి దంపతులు బెజ్జంకిలో బట్టల దుకాణం నిర్వహిస్తున్నారు. ఆదివారం ఉదయం భార్యాభర్తలు పురుగు మందు తాగారు. ఘటనా స్థలంలో భార్య మృతి చెందగా, భర్త ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. దంపతుల మృతితో తీవ్ర విషాదం నెలకొంది.