GDWL: శ్రీజోగులాంబ బాల బ్రహ్మేశ్వర స్వామి దేవస్థానంలో నిర్వహించిన బహిరంగ టెండర్లలో ఈ ఏడాది ఆదాయం తగ్గింది. గతేడాది పార్కింగ్ రూ. 70లక్షలు,టెంకాయల విక్రయాల ద్వారా రూ.కోటి 27 లక్షలు, చీరల వేలంలో రూ.91 లక్షల భారీ ఆదాయం లభించింది. ఈ ఏడాది 6సార్లు వాయిదా పడిన అనంతరం నిర్వహించిన టెండర్లలో పార్కింగ్ రూ.60 లక్షలు, టెంకాయలు రూ.67లక్షలు, చీరలు రూ.80 లక్షల వచ్చాయి.