TG: హార్ట్ఫుల్నెస్ సంస్థకు ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్ అభినందనలు తెలిపారు. శాంతి, సామరస్యం, ఆధ్యాత్మికతను హార్ట్ఫుల్నెస్ ప్రోత్సహిస్తోందన్నారు. అందరూ ధ్యానం చేసేలా దాజీ ప్రోత్సహిస్తున్నారని కొనియాడారు. భావోద్వేగాలను అదుపులో ఉంచుకునేందుకు ధ్యానం ఉపకరిస్తోందని తెలిపారు. డిసెంబర్ 21న ప్రపంచ ధ్యాన దినోత్సవంగా UNO ప్రకటించిందన్నారు.