అసోంలో రెండో రోజు ప్రధాని మోదీ పర్యటించనున్నారు. అమ్మెనియా-యూరియా ప్రాజెక్టుకు శంకుస్థాపనతో పాటు పలు అభివృద్ధి కార్యక్రమంలో పాల్గొననున్నారు. తొలిరోజు పర్యటనలో భాగంగా ప్రధాని.. రూ.5 వేల కోట్లతో నిర్మించిన గోపీనాథ్ అంతర్జాతీయ విమానాశ్రయంలోని నూతన టెర్మినల్ భవనాన్ని, అసోం తొలి సీఎం బొర్దొలోయి 80 అడుగుల ఎత్తైన విగ్రహాన్ని ఆవిష్కరించిన విషయం తెలిసిందే.