ప్రకాశం: పాఠశాల రికార్డుల్లో విద్యార్థుల సంఖ్య తారుమారు చేసినట్లుగా ఆరోపణలు ఎదుర్కొన్న ఉపాధ్యాయుడిని సస్పెండ్ చేసినట్లు DEO రేణుక తెలిపారు. సంతనూతలపాడు మండలం మంగమూరు ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడు వెంకటేశ్వర్లు విధుల్లో ఉండగా.. ఇటీవల RJD పాఠశాలను ఆకస్మికంగా సందర్శించారు. ఆ సమయంలో విద్యార్థుల సంఖ్య రికార్డుల్లో అధికంగా ఉన్నట్లు గుర్తించినట్లు తెలిపారు.