CTR: జిల్లా కేంద్రంలోని మెసానికల్ మైదానంలో ఈనెల 22న లీప్ టీచర్స్ టోర్నమెంట్ నిర్వహించనున్నట్లు డీఈవో రాజేంద్రప్రసాద్, స్కూల్ గేమ్స్ సెక్రెటరీ బాబు తెలిపారు. ఇందులో భాగంగా క్రికెట్ పోటీల్లో పురుషుల విభాగంలో పలమనేరు, చిత్తూరు, కుప్పం, నగరి, త్రోబాల్ మహిళా విభాగంలో కుప్పం, నగరి, పలమనేరు, చిత్తూరు జట్లు పాల్గొంటాయని వారు పేర్కొన్నారు.