NGKL: కల్వకుర్తి మున్సిపాలిటీ పరిధిలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులను వేగవంతం చేయాలని ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి లబ్ధిదారులకు సూచించారు. శనివారం పట్టణంలోని క్యాంప్ కార్యాలయంలో 66 మంది లబ్ధిదారులకు మంజూరు పత్రాలను అందించారు. నిరుపేదల సొంతింటి కలను నెరవేర్చడమే ప్రభుత్వ లక్ష్యమని, అర్హులైన వారందరికీ ఇళ్లు మంజూరు చేస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు