KMR: పెద్ద కొడప్గల్ మండలం అంజని గేట్ దగ్గర జాతీయ ప్రధాన 161 రహదారిపై ఆదివారం ఎస్సై అరుణ్ కుమార్ యాదవ్ ఆధ్వర్యంలో వాహనాల తనిఖీ నిర్వహించారు. ఎస్సై మాట్లాడుతూ.. ప్రతి వాహనదారుడు కచ్చితంగా ప్రభుత్వ ఆదేశాలను పాటించాలని సూచించారు. సీటు బెల్టు, హెల్మెట్లను కచ్చితంగా వాడాలని తెలిపారు. నిబంధనలు అతిక్రమిస్తే శాఖా పరమైన చర్యలు తీసుకుంటామన్నారు.