CTR: పూతలపట్టు మండలం SV సెట్ కళాశాల వద్ద క్రిమినల్ హాట్స్పాట్ బోర్డ్ ఏర్పాటు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ ప్రదేశంలో నిత్యం మందుబాబులు మద్యం తాగి స్థానికులను ఇబ్బందులకు గురి చేస్తున్నట్లు ఫిర్యాదులు అందడంతో ఈ చర్యలు తీసుకున్నామన్నారు. ఎవరన్నా అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే చర్యలు ఉంటాయని వారు హెచ్చరించారు.