NZB: వేల్పూర్ మండలంలోని గ్లోబల్ కిడ్స్ స్కూల్లో ‘పాజిటివ్ పేరెంటింగ్ ప్రోగ్రాం’ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి ముఖ్య అతిధిగా విచ్చేశారు. చదువుకునే పిల్లలు మొబైల్ ఫోన్‌కు, జంక్ ఫుడ్స్‌కు అలవాటు పడి బంగారు భవిష్యత్తుకు దూరం అవుతున్నరన్నారు. తల్లిదండ్రులు పిల్లలను వాటికి దూరంగా ఉంచాలని ఆయన సూచించారు.