KRNL: గ్రామాభివృద్ధి విషయంలో నిర్లక్షం వహిస్తున్న పెద్దకడబూరు పంచాయితీ కార్యదర్శి సాయి తేజను సస్పెండ్ చేయాలని సీపీఐ మండల కార్యదర్శి వీరేష్ ఇవాళ డిమాండ్ చేశారు. గ్రామంలో డ్రైనేజీలు నిండిపోవడం, వీధిలైట్లు పనిచేయకపోవడం, పంచాయతీ బోర్లు నిర్వీర్యంగా ఉండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. విధులకు సైతం డుమ్మా కొడుతున్నారని ఆయన మండిపడ్డారు.