MBNR: యూరియా సరఫరాలో రైతుల ఇబ్బందులు తొలగించేందుకు ప్రభుత్వం ఆన్లైన్ బుకింగ్ సౌకర్యం తీసుకొచ్చిందని జడ్చర్ల మండల ఏవో గోపీనాథ్ తెలిపారు. రైతులు ‘ఫర్టిలైజర్ బుకింగ్’ యాప్ ద్వారా మొబైల్లోనే యూరియాను బుక్ చేసుకోవచ్చన్నారు. ఈ విధానంతో పారదర్శకత పెరిగి సరఫరా సజావుగా జరుగుతుందని, ఎరువుల డీలర్లు తప్పనిసరిగా యాప్ ద్వారానే విక్రయాలు చేయాలని సూచించారు.