SRCL: జిల్లా కోర్టులో నేషనల్ లోక్ అదాలత్ నిర్వహించనున్నట్లు అధ్యక్షుడు చింతోజు భాస్కర్ తెలిపారు. క్షణికావేశంలో ఒకరిపై ఒకరు పెట్టుకున్న కేసులతో కోర్టుల చుట్టూ తిరుగుతూ ఇబ్బంది పడుతున్న వారికి ఇది చక్కని అవకాశమన్నారు. ఈ వేదిక ద్వారా వివాదాలను రాజీ మార్గంలో పరిష్కరించుకోవచ్చని సూచించారు. పెండింగ్ కేసుల పరిష్కారం కోసమే లోక్ అదాలత్ అని అన్నారు.