CTR: జిల్లాలో ఇవాళ ఉదయమే పల్స్ పోలియో కార్యక్రమం మొదలైంది. ఆరోగ్య కార్యకర్తలు తమకు కేటాయించిన శిబిరాలకు చేరుకున్నట్లు ఉన్నత అధికారులు తెలిపారు. తల్లిదండ్రులు తమ పిల్లలను తీసుకు వచ్చి పోలియో చుక్కలు వేయించుకుంటున్నట్లు పేర్కొన్నారు. ఐదేళ్లలోపు చిన్నారులకు ప్రభుత్వ ఆసుపత్రి, బస్టాండ్, మెయిన్ సర్కిళ్ల వద్ద పోలియో చుక్కలు వేస్తున్నట్లు తెలియాజేశారు.