సత్యసాయి: పుట్టపర్తిలోని ప్రశాంతి నిలయంలో క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. సత్యసాయి మహాసమాధిని విదేశీ భక్తులు విద్యుద్దీపాలు, క్రిస్మస్ ట్రీలతో సుందరంగా అలంకరించారు. శనివారం రాత్రి భక్తులు ఆలపించిన క్యారల్స్ అందరినీ ఆకట్టుకున్నాయి. ఈ నెల 25 వరకు వేడుకలు కొనసాగనున్నాయి. దేశ, విదేశాల నుంచి వచ్చిన భక్తులు మహాసమాధిని దర్శించుకుంటున్నారు.