ప్రకాశం: కనిగిరిలోని కొత్తూరులో సోమవారం తెల్లవారుజామున హనుమంతునిపాడు ఎస్సై మాధవరావు వాహనాల డ్రైవర్లకు ఫేస్ వాష్ కార్యక్రమాన్ని చేపట్టారు. ఆయన మాట్లాడుతూ.. నిద్ర వచ్చే పరిస్థితుల్లో వాహనాన్ని నడపవద్దు అని సూచించారు. నిద్ర మత్తులో ప్రమాదానికి గురి అయ్యే ఆస్కారం ఉందని తెలిపారు. ఆగి ఉన్న వాహనాలను గమనిస్తూ డ్రైవింగ్ చేయాలని అన్నారు.