WGL: HYDలోని బొల్లారం రాష్ట్రపతి నిలయంలో ఇవాళ మంత్రులు సీతక్క, కొండా సురేఖ, అడ్లూరి లక్ష్మణ్ కుమార్ రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిసి మేడారం మహా జాతరకు ఆహ్వాన పత్రిక అందజేశారు. సమ్మక్క చీర, కంకణం, కండువా బంగారం సమర్పించారు. మంత్రి సీతక్క జాతర ఘనత, ఆదివాసీ సంస్కృతి, అభివృద్ధి వివరించారు. రాష్ట్రపతి జాతరకు రావడానికి ప్రయత్నిస్తానని తెలిపారు.