W.G: వీరవాసరం మద్దాల రామకృష్ణమ్మ ZPHSలో సోమవారం నిర్వహించే జిల్లాస్థాయి సైన్స్ ఫెయిర్‌కు సర్వం సిద్ధమైంది. ఈ మేరకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు DEO నారాయణ, జిల్లా సైన్స్ ఆఫీసర్ వి. పూర్ణచంద్రరావు ఆదివారం తెలిపారు. ఒక్కో మండలం నుంచి 11 ఉత్తమ ప్రదర్శనలు ఈ మేళాలో కొలువుదీరనున్నాయి.