ATP: స్థానిక వ్యవసాయ మార్కెట్ యార్డు ప్రాంగణంలో ఈ వారం జరిగిన పశువులు, జీవాల సంతల ద్వారా రూ.3.29 లక్షలకు పైగా ఆదాయం వచ్చినట్లు ఏడీఎం రాఘవేంద్ర కుమార్ తెలిపారు. అందులో శనివారం జరిగిన గొర్రెలు, మేకలు, పొట్టేళ్ల సంత ద్వారా రూ.1,93,500 మేర వసూలు కాగా.. ఆదివారం జరిగిన ఆవులు, ఎద్దులు, గేదెల సంత నుంచి రూ.1,35,600 మేర వసూలైనట్లు పేర్కొన్నారు.