TG: రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ కార్యాలయాలు, యూనివర్సిటీలు ప్రభుత్వ భవనాల్లోనే కొనసాగించాలని భావిస్తోంది. 2026 ఫిబ్రవరి 1 నుంచి ప్రైవేట్ భవనాల అద్దె చెల్లింపులు నిలిపివేయనుంది. జనవరి 1వ తేదీ నుంచి ప్రభుత్వ భవనాల్లోనే పనిచేయాలని అన్ని శాఖలకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. డిసెంబర్ 31లోపు ప్రభుత్వ భవనాలకు షిఫ్ట్ కావాలని ఆదేశాల్లో పేర్కొంది.