ASR: పల్స్ పోలియో చుక్కలు వేయడం వల్ల పిల్లలకు సంపూర్ణ ఆరోగ్యం లభిస్తుందని అరకు ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం అన్నారు. ఆదివారం అరకులోయ ట్రైబల్ మ్యూజియం వద్ద ఏర్పాటు చేసిన పోలియో చుక్కల శిబిరంలో పాల్గొని, పలువురు పిల్లలకు పోలియో చుక్కలు వేశారు. పోలియో చుక్కల వల్ల పిల్లలు పోలియో వైరస్ నుంచి బయట పడతారన్నారు. పోలియో పూర్తి నిర్మూలన అవుతుందన్నారు.