మాస్ మహారాజా రవితేజ లేటెస్ట్ మూవీ ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’. ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 13న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. అయితే, సామాన్య ప్రేక్షకుడికి సినిమాను చేరువ చేయాలని రవితేజ షాకింగ్ నిర్ణయం తీసుకున్నారు. ఈ క్రమంలో నిర్మాత సుధాకర్ చెరుకూరి ఒక ప్రకటన చేస్తూ.. ఈ చిత్రానికి ఎలాంటి రేట్ల పెంపు ఉండదని, పాత సాధారణ ధరలకే టికెట్లు లభిస్తాయని స్పష్టం చేశారు.