నంద్యాల పట్టణం నూనెపల్లెలోని ఠాగూర్ పురపాలక ప్రాథమిక పాఠశాలలో ఆదివారం పల్స్ పోలియో కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా చిన్నారులకు కలెక్టర్ రాజకుమారి పోలియో చుక్కలు వేశారు. ప్రతీ చిన్నారికి పోలియో చుక్కలు తప్పనిసరిగా వేయించాలని తల్లిదండ్రులకు ఆమె సూచించారు. పోలియో నిర్మూలనకు అందరూ బాధ్యతగా సహకరించాలని పేర్కొన్నారు.