శ్రీకాకుళం: సోంపేట మండలం పలాసపురంలోని శ్రీ కపిలేశ్వర విరించి నారాయణస్వామి దేవాలయంలో మొదటి పుష్యమాస ఆదివారం సందర్భంగా భక్తులు భారీగా తరలివచ్చారు. తెల్లవారుజాము నుంచే ఆలయానికి భక్తుల రద్దీ నెలకొంది. పుష్యమాసంలో విభూతి ధరించితే చర్మ సంబంధిత వ్యాధులు నయమవుతాయని భక్తుల నమ్మకం. ఆంధ్రప్రదేశ్తో పాటు ఒడిశా రాష్ట్రం నుంచి కూడా పెద్ద సంఖ్యలో భక్తులు హాజరుకావడం విశేషం.