ప్రకాశం: కంభం పట్టణంలోని కందులాపురం సర్కిల్లో వైసీపీ ఆధ్వర్యంలో వైఎస్ జగన్ 53వ జన్మదిన వేడుకలు ఇవాళ ఘనంగా నిర్వహించారు. ముఖ్యఅతిథిగా మాజీ ఎమ్మెల్యే, వైసీపీ ఇంఛార్జ్ కేపీ నాగార్జున రెడ్డి హాజరై, కేక్ కట్ చేశారు. వైసీపీ ప్రభుత్వం ప్రజలకు ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేపట్టిన ఘనత వైయస్ జగన్‌కే దక్కుతుందని నాగార్జున రెడ్డి తెలిపారు.