TPT: అమెరికా NRI శామ్ కుమార్ టీటీడీ కాటేజ్ డొనేషన్ పథకానికి రూ.10 లక్షల విరాళం అందించారు. ముందుగా అదనపు ఈవో కార్యాలయం వద్ద శనివారం సాయంత్రం టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరికి చెక్కును ఇచ్చినట్లు పేర్కొన్నారు. అనంతరం దాతను వెంకయ్య అభినందించారు. ఈ సందర్భంగా శామ్ కుమార్ మాట్లాడుతూ.. ఎమైనా అభివృద్ధి పనులు ఉంటే తెలియజేయాలన్నారు.