HYD: నగర శివారులోని రామోజీ ఫిలిం సిటీలో వింటర్ ఫెస్టివల్ సీజన్ ప్రారంభమైంది. ఫిబ్రవరి 1వ తేదీ వరకు కొనసాగనున్న ఈ ఫెస్టివల్లో కార్నివాల్, వినోద కార్యక్రమాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. చిన్నారులు, కుటుంబాలు ఉత్సాహంగా పాల్గొంటున్నారు. సందర్శకుల సౌకర్యార్థం రాత్రి 9 గంటల వరకు ఫిలిం సిటీ సందర్శనను పొడిగించారు.