GNTR: ఉండవల్లి మెయిన్ బజార్, ఎస్సీ కాలనీల్లో మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను ఆదివారం గుర్తుతెలియని వ్యక్తులు చింపేశారు. ఈ ఘటనపై స్థానిక వైసీపీ నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రశాంతంగా ఉన్న ప్రాంతంలో అలజడి సృష్టించడానికే ఇలాంటి పనులు చేస్తున్నారని వారు మండిపడ్డారు.