KNR: రైతులకు ఎరువుల లభ్యత, నిల్వలు, ధరల వివరాలను అందించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘ఫెర్టిలైజర్’ మొబైల్ యాప్ ప్రారంభంలోనే సాంకేతిక సమస్యలు ఎదుర్కొంటోంది. యాప్ ఓపెన్ చేయగానే ‘తాత్కాలికంగా నిలిపివేయబడింది’ అనే సందేశం కనిపిస్తుండటంతో రైతులు అవసరమైన సమాచారం పొందలేకపోతున్నారు. వెంటనే అధికారులు స్పందించి సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు.