కోనసీమ: జిల్లా ఎస్పీ రాహుల్ మీనా ఆదేశాలతో అమలాపురం సర్కిల్ పరిధిలోని పలు పోలీస్ స్టేషన్లలో రౌడీషీటర్లకు ఆదివారం కౌన్సెలింగ్ నిర్వహించారు. పట్టణ, రూరల్ సీఐలు ప్రశాంత్ కుమార్, వీరబాబు, ఎస్సైలు రాజేష్, శేఖర్ బాబు రౌడీషీటర్ల ప్రవర్తనపై ఆరా తీశారు. పాత నేర చరిత్రను వదిలిపెట్టి, సమాజంలో బాధ్యతాయుతమైన పౌరులుగా జీవించాలని సూచించారు.