వాముతో అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం కలుగుతుందని నిపుణులు చెబుతున్నారు. అసిడిటీతో బాధపడేవారు వాము, జీలకర్ర మరిగించిన నీళ్లను తాగితే ఫలితం ఉంటుంది. గర్భిణులకు ఎదురయ్యే మలబద్ధకం, అజీర్తిని తగ్గిస్తుంది. బాలింతల్లో పాల ఉత్పత్తిని పెంచుతుంది. ఆర్థరైటిస్ వల్ల ఏర్పడే నొప్పి నుంచి ఉపశమనాన్ని ఇస్తుంది. వామును పాలలో కల్పి వేడి చేసి తాగితే నెలసరి సమయంలో కలిగే కడుపు నొప్పి తగ్గుతుంది.