SKLM: నరసన్నపేట మండలం మడపాం వంశధార నది ఒడ్డున ఉన్న అభయాంజనేయ స్వామి ఆలయంలో వైసీపీ నేతలు ఆ పార్టీ అధినేత, మాజీ సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా ప్రత్యేక పూజలు చేపట్టారు. వచ్చే ఎన్నికల్లో మళ్లీ జగన్ సీఎం అయ్యే విధంగా ఆశీర్వదించాలని భగవంతుని ప్రార్థించారు. ఈ కార్యక్రమంలో మాజీ డిప్యూటీ సీఎం తనయుడు, జడ్పీటీసీ ధర్మాన కృష్ణ చైతన్య, తదితరులు ఉన్నారు.