ఏలూరు నగరంలోని 38వ డివిజన్ సుబ్బమ్మ దేవి స్కూల్, ఇవాళ నిర్వహించిన పల్స్ పోలియో కార్యక్రమాన్ని ఎమ్మెల్యే బడేటి చంటి ప్రారంభించారు. ఈ సందర్భంగా చిన్నారులకు ఆయన పోలియో చుక్కలు వేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పోలియో నిర్మూలనకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని సూచించారు. అదేవిధంగా ఐదేళ్లలోపు చిన్నారులకు తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలన్నారు.