BDK: భద్రాచలం ఐటీడీఏ కార్యాలయంలో సోమవారం గిరిజన దర్బార్ నిర్వహించనున్నట్లు పీఓ. రాహుల్ తెలిపారు. గిరిజనులు తమ సమస్యలను విన్నవించుకునేందుకు ఉదయం 10:30 గంటలకు దర్భార్ ప్రారంభమవుతుందని పేర్కొన్నారు. బాధితులు అందజేసే దరఖాస్తులను స్వీకరించి, సత్వర పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని అన్ని శాఖల అధికారులను ఆదేశించారు.