VZM: భోగాపురం మండలం ముడసలపేట గ్రామంలో ఇటీవల జరిగిన హత్య కేసును పోలీసులు ఛేదించారు. నాన్నమ్మను హత్య చేసిన మనవడు ముడసల గౌరి (27)ను అరెస్టు చేసినట్లు ఎస్పీ దామోదర్ సోమవారం తెలిపారు. మద్యం మత్తులో నిందితుడు నాన్నమ్మ అప్పయ్యమ్మను హత్య చేసి, బంగారు వెండి ఆభరణాలు దొంగిలించినట్లు విచారణలో తేలిందన్నారు.