KMM: కామేపల్లి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఈనెల 26 నుంచి 28 వరకు నిర్వహించనున్న తెలంగాణ రాష్ట్ర స్థాయి సీనియర్ పురుషుల మోడరన్ కబడ్డీ పోటీలకు హాజరుకావాలని ఆదివారం ఎమ్మెల్యే కోరం కనకయ్యను మోడరన్ కబడ్డీ అసోసియేషన్ ప్రతినిధులు కోరారు. అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు అరెం రవి, ప్రధాన కార్యదర్శి ఈసం రంగారావు ఆదివారం ఎమ్మెల్యేను కలిసి ఆహ్వాన పత్రికను అందజేశారు.