నారాయణపేటలో జరిగిన సమావేశంలో రిటైర్డ్ ఉద్యోగుల జిల్లా నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా మనోహర్ ప్రసాద్ గౌడ్, గౌరవ అధ్యక్షుడిగా రాములు ఎన్నికయ్యారు. ఉపాధ్యక్షులుగా మౌలానా, వేణుగోపాల్, అనంతమ్మ, ప్రధాన కార్యదర్శిగా రమేష్ బాబు, జాయింట్ సెక్రటరీలుగా సావిత్రమ్మ, బాలరాజు ఎంపికయ్యారని కార్యదర్శి సంతోష్ కుమార్ తెలిపారు.