MBNR: జిల్లా వ్యాప్తంగా చలి తీవ్రత పెరగడంతో ప్రజలు వణుకుతున్నారు. గత నాలుగైదు రోజులుగా కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని వాతావరణ శాఖ వెల్లడించింది. చలి గాలుల కారణంగా ఉదయం పాఠశాలలు, కళాశాలలకు వెళ్లే విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. సూర్యోదయం ఆలస్యమవుతుండటంతో జనజీవనం స్తంభించింది. గ్రామాల్లో ప్రజలు ఉదయాన్నే చలి మంటలు వేసుకుని ఉపశమనం పొందుతున్నారు.