ATP: గుత్తిలో హిందూ సమ్మేళనం కార్యక్రమంలో భాగంగా ఆదివారం వివిధ పాఠశాలలకు చెందిన విద్యార్థులు, ర్యాలీ నిర్వహించారు. భారత్ మాతాకీ జై అంటూ నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించారు. హిందూ సమ్మేళనం నిర్వాహకులు గోపాల్ మాట్లాడుతూ.. గుత్తిలో మొదటిసారిగా ఈ హిందూ సమ్మేళనం కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. భారతదేశ సమైక్యతకు ప్రతిరూపం హిందూ సమ్మేళనం అన్నారు.