VKB: కుల్కచర్ల నుంచి నవపేట్ వెళ్లే ప్రధాన రహదారిలో గండి చెరువు తండా సమీపంలో రోడ్డు పక్కన లోతుగా ఏర్పడిన గుంత ప్రమాదకరంగా మారింది. ఈ గుంత వల్ల రాత్రి వేళల్లో వాహనదారులు ప్రమాదాల బారినపడే అవకాశం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు వెంటనే స్పందించి ఈ సమస్యను పరిష్కరించి, రహదారికి మరమ్మత్తులు చేయాలని కోరుతున్నారు.